BREAKING
ఏపీ స్థానిక ఎన్నికల్లో పెరిగిన నిఘా: ఒకే రోజు 9 ఎఫ్‌ఐఆర్‌లు, 1,177 కేసుల నమోదు అర్నాబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు పోటుమెరక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 2 పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్నబ్ తీవ్ర తుఫాన్ దృష్ట్యా తీర ప్రాంతంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ఘటనలపై ఎస్ఈసీ విచారణ చేయించాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హ్యాండ్లూమ్ హౌస్ డైరెక్టర్‌గా కర్నాటి వజ్రమ్మ ఏకగ్రీవ ఎన్నిక వెల్దుర్తి మండలం: బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు అన్నారం వద్ద రోడ్డు ప్రమాదం: బైక్‌ను కట్ చేస్తూ ఢీకొట్టిన ఇసుక లారీ.. యువకుడికి తీవ్ర గాయాలు! సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం:కాంగ్రెస్ పార్టీ పరిగి మండల అధ్యక్షుడు వెంకట్ రాములు మర్రిపాడు ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం - చక్రం తిప్పిన పుట్టం సోదరులు - 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం ఆత్మకూరులో ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - విజయ పదంలో స్థానికం తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..తహశీల్దార్ నరేశ్ వేమవరంలో టీడీపీ అభ్యర్థి మాదల ఝాన్సీ లక్ష్మీ భాయ్ ఇంటింటి ప్రచారం బోగోలు ఎంపీటీసీ బరిలో 23 మంది పోటీకి సిద్ధం - ముగ్గురు ఏకగ్రీవంగా ఎంపిక

పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ స్నేహ మెహ్రా

Select Suryaa Now
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం పరిగి సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆమె రికార్డులు, కేసుల ఫైళ్లను పరిశీలించి పోలీస్ స్టేషన్ల పనితీరు, నేరాల నియంత్రణ, కేసుల పురోగతిపై సమీక్షించారు. ఆస్తి నేరాలు, ఎన్‌డీపీఎస్, సైబర్ నేరాలు, మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల దర్యాప్తులో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సీసీటీఎన్‌ఎస్‌లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, సీసీటీవీ కెమెరాల వినియోగాన్ని పెంచాలని, సైబర్ నేరాల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని తెలిపారు. ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, పరిగి సీఐ కొండల్ రెడ్డి, కొడంగల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, సబ్ డివిజన్ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.