కేసీఆర్‌తో ఎమ్మెల్యే జీఎంఆర్ భేటీ
పటాన్‌చెరు:బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మంగళవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుతో కలిసి ఆయన కేసీఆర్‌తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఈ నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించనున్న తన సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి కుమారుడు గూడెం సందీప్‌రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరుకావాలని కేసీఆర్‌ను జీఎంఆర్ ఆహ్వానించారు. అనంతరం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని కేసీఆర్‌కు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.