కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు
పెద్దశంకరంపేట ; కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశం పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాలలో కల్లు విక్రయ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వ నిభంధనలకు విరుధ్ధంగా కల్లు విక్రయిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆయా గ్రామాలలో కల్లు షాంపిల్స్ను సేకరించారు. ఇటీవల కోళాపల్లి గ్రామంలో అనుమతి లేకుండా కల్లు దుకాణాలు నడుపుతున్న రెండు షాపులపై కేసులు నమోదు చేశామన్నారు. కల్తీకల్లు అమ్మినట్లు రుజువైనా, అనమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసిన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులున్నా