విరువూరులో ఎంపీటీసీ ఏకగ్రీవం
వరికుంటపాడు: మేజర్ న్యూస్ : మండలంలోని విరువూరు ఎంపీటీసీ స్థానానికి చండ్ర మధుసూదన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరికుంటపాడు మండల ఎంపీపీ అభ్యర్థిగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆయన పేరును ప్రకటించిన నేపథ్యంలో, ఆయన పోటీ చేసిన ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఎంపీటీసీగా ఏకగ్రీవమైన చండ్ర మధుసూదన్‌రావుకు రిటర్నింగ్ అధికారి (ఆర్వో) వెంకటేశ్వరరావు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విలువూరు ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కావడంతో స్థానికంగా ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.