అర్నబ్ తుఫాన్ దృష్ట్యా నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
కైకలూరు, మేజర్ న్యూస్, అర్నబ్ తుఫాన్ దృష్ట్యా నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను తీరం వైపు 150 - 180 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తూ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను తీరం దాటే సమయంలో ప్రచండ గాలులు వీస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దు బలహీనమైన తాత్కాలికమైన కట్టడాలు మరియు రేకుల షెడ్లలో ఉండేవారు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఏర్పాటు చేయు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని మొబైల్ ఫోన్లు, పవర్ బ్యాంకులు పూర్తిగా చార్జ్ చేసి పెట్టుకోవాలని అలాగే ఆధార్ కార్డులు, భూమి పత్రాలు, బ్యాంక్ పాస్ పుస్తకాలు మరియు విలువైన వస్తువులను భద్రపరుచుకోవాలని సూచించారు. రైతులు తమ పంట పొలాల్లో నిలిచిన నీరు బయటకు పోయేలా మురుగు కాలువలను సిద్ధం చేసుకోవాలని కనీసం 2-3 రోజులకు సరిపడా పొడి ఆహారం (బిస్కెట్లు, బ్రెడ్ మొదలైనవి), మంచినీరు, అత్యవసర మందులు మరియు టార్చ్ లైట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. సముద్ర తీరనికి చేరువలో ఉన్న కలిదిండి మండలం గ్రామాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సి ఆర్ పి ఎఫ్ బృందాలకు సహకరించాలని అలాగే వారి సేవలు వినియోగించుకోవాలని తెలిపారు.
రిపోర్టర్. ఎం రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా