BREAKING
యాతపేట, పెదబొడ్డేపల్లి ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ రష్యా నిరంతర దాడుల నేపథ్యంలో నూతన జల రవాణా మార్గాల నిర్మాణం తుపాన్ వేళ బాధితులకు అండగా హోం మంత్రి అనిత!. థేల్స్ కంపెనీ సివిల్, మిలిటరీ రాడార్ వ్యవస్థల ఎంపిక పాకిస్తాన్‌పై శ్రీలంక ఘన విజయం.. 8 వికెట్లతో గెలిచి ట్రై సిరీస్ ఫైనల్‌కు అర్హత అనకాపల్లి జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి పల్లేల సాయి కిరణ్. అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా చీడికాడ కూటమి జెడ్పిటిసి అభ్యర్థి ఖతార్ మధ్యవర్తిత్వానికి ఇరాన్ సద్భావన ప్రదర్శించాలి...ఖతార్ స్పష్టీకరణ విజయ్ దేవరకొండ రణబాలి సినిమా నుంచి కోబలి ఫుల్ వీడియో సాంగ్ విడుదల అర్నబ్ తుపాను ముప్పు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - హోంమంత్రి అనిత కోనసీమ ప్రజలకు అండగా ఉంటా 'ఆర్నబ్’ తుఫాన్ కు అనకాపల్లి జిల్లా పోలీస్ హై అలర్ట్ - సర్వసన్నద్ధం. ఉక్రెయిన్‌కు క్రిప్టో విరాళాల సమాచారం బహిర్గతం చేసిన బైనాన్స్ తుఫాన్ పునరవాస కేంద్రంలో 30 మంది ఆశ్రయం తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రైతులకు అండగా ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రగతి ధర్మారం గ్రామంలో కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్

Select Suryaa Now
రైతులకు అండగా ఐకేపీ కొనుగోలు కేంద్రం  ప్రగతి ధర్మారం గ్రామంలో కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్

రామాయంపేట ; రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, దళారుల బెడద లేకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రగతి ధర్మారం సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రామాయంపేట మండలం పరిధిలోని ప్రగతి ధర్మారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.పంట చేతికొచ్చిన సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు
ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం తదితర అంశాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చే రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా సహకరిస్తామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది, గ్రామస్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.