తీరం దిశగా తీవ్ర తుఫాను 'అర్నబ్': రేపు యానాం వద్ద తీరం దాటే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అర్నబ్’ గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వేగంగా తీరం వైపు కదులుతోంది. ప్రస్తుతం ఈ తుఫాను కాకినాడకు 140 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అలాగే మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, బాపట్లకు 300 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇది రేపు యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల తీవ్ర వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.