రేణుక ఎల్లమ్మను దర్శించుకుంటే సర్వశుభాలు
కొల్చారం ... ఆదిశక్తి పరాశక్తి శ్రీ రేణుక ఎల్లమ్మను దర్శించుకుంటే భక్తులందరికీ శుభాలు కలుగుతాయని మాజీ ఎంపీటీసీ పాల్వంచ అరుణ కృష్ణ గౌడ్, దంపతులు అన్నారు. కొల్చారం మండల కేంద్రంలోని శ్రీ రేణుక మాత ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.కొల్చారం గ్రామానికి చెందిన పాల్వంచ అరుణ కృష్ణ గౌడ్ దంపతులు అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ అర్చకులు పులుగుర్త నాగరాజు శర్మ, భగవాన్ శర్మ మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
పూజా కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తల్లి రేణుక ఎల్లమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని దంపతులు అమ్మను వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలోపాల్వంచ రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్, వడ్ల ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, శివ కుమార్ గౌడ్, ఆశన్నగారి అంజయ్య, కమ్మరి దశరథం, కుమ్మరి నాగయ్య, పాప గౌడ్, కృష్ణ గౌడ్ (కిట్టు), సుధాకర్ గౌడ్, సత్య నారాయణ, పాల్వంచ యాదమ్మ, రుక్మిణి, లలిత, మౌనిక తదితరులు పాల్గొన్నారు.