telangana
నేరాల నియంత్రనకు సీసీ కెమెరాలు ఎంతో ముఖ్యం - ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాస్
సూర్య,లింగంపేట్ : నేరాల నియంత్రనకు సీసీ కెమెరాలు ఎంతోగానో ఉపయోగ పడతాయని ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాస్ అన్నారు.మంగళవారం లింగంపేట్ మండలంలోని పరుమల్లా గ్రామంలో గ్రామ సర్పంచ్,పాలకవర్గ సభ్యులు ఏర్పాటు చేసిన 5 సోలార్ సీసి కెమెరాలను స్థానిక ఎస్ఐ దీపక్ కుమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు.సర్పంచ్ గడ్డం బాబాయి నరేష్,పాలకవర్గ సభ్యులు నూతనంగా గ్రామంలో 5 సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని సర్పంచ్,పాలకవర్గ సభ్యులను డిఎస్పీ అభినందించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు ప్రజల భద్రత నిమిత్తం, ఎటువంటి దొంగతనాలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు మూడో కన్నులా పనిచేస్తాయని పేర్కొన్నారు.సీసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన నేరాలాను చాలావరకు అరికట్టవచన్నారు.మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు స్వచ్చందంగా ఏర్పాటు చేసుకోవాలని మండల ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో లింగంపేట్ ఎస్ఐ దీపక్ కుమార్,పోలీస్ బృందం, గ్రామ ఉప సర్పంచ్ కొడబోయిన శ్రీను,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడబోయిన శ్రీనివాస్,గ్రామ మాజీ ఎంపీటీసీ బద్ధ చందు,పీఏసీఎస్ డైరెక్టర్ సాయికుమార్,మాజీ పీఏసీఎస్ డైరెక్టర్లు గుండ్రె రెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి,కుమ్మరి సిద్ధిరాములు,పాలకవర్గ సభ్యులు గుండ్రె రెడ్డి గారి మౌనిక రెడ్డి,మంద దుర్గాపతి,గంట దత్తు,ఈర్ల గోపాల్,ఈర్ల మంజుల సాయిబాబు,బద్ధ రాజులు,బొల్లారం ప్రవళిక భూమయ్య,కీర్తి స్పందన ప్రశాంత్,రాజుగారి లక్ష్మి,మాజీ వార్డు మెంబర్ మరిపల్లి శ్రీనివాస్ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.