మోద-3 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా కే. శాంతమ్మ రిటర్నింగ్ అధికారికి బీ-ఫామ్ సమర్పణ...
పరిగి మేజర్ న్యూస్: పరిగి మండలం మోద-3 ఎంపీటీసీ స్థానానికి మంగళవారం కూటమి అభ్యర్థిగా కే. శాంతమ్మను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు మంత్రి సవితమ్మ ఆశీస్సులతో పార్టీ తరఫున బీ-ఫామ్‌ను మంగళవారం రిటర్నింగ్ అధికారికి అందజేశారు. గ్రామపంచాయతీ నాయకుల సమక్షంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సంజీవరాయప్ప, ఎస్‌ఎన్ గోవింద్ రెడ్డి పరిటాల శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.