గోవింద నామ స్మరణతో మారుమోగిన వాడపల్లి
కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తజనంతో కిటకిటలాడింది ఏడువారాల నోము నోచుకుని అష్టోత్రం కళ్యాణం చేయించుకునే భక్తులతో ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించింది నిత్య అన్నదాన పథకానికి గోపాలపురం మండలం , చిట్యాల కు చెందిన నందిన సతీష్ శ్రీలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యులు రూ 51.116 వేలు విరాళంగా అందించారు వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి చరిత్ర గురించి వివరించారు చైర్మన్ ముదునూరి వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందించారు