telangana
రైతుల సమన్వయంతో రీ-సర్వే పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి: కుంటాల మండలం రాజాపూర్ తాండలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే పనులను కలెక్టర్మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, సర్వే పురోగతిని సమీక్షించారు. భూముల హద్దుల నిర్ధారణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని సూచించారు. రైతులకు సర్వేపై అవగాహన కల్పిస్తూ, వారి సహకారంతో పనులు పూర్తి చేయాలన్నారు. సర్వే సమయంలో సంబంధిత అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.రీ-సర్వే పనులను వేగవంతం చేసేందుకు త్వరలో ఆధునిక సర్వే పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.ఈ తనిఖీలో తహసీల్దార్ కమల్ సింగ్‌తో పాటు రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.