37వ డివిజన్లో భారీ మెజారిటీ లక్ష్యంగా రసూల్ అడుగులు
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 37వ డివిజన్లో టిడిపి అభ్యర్థి అబ్దుల్ రసూల్ సామాన్య ప్రజలను పలకరిస్తూ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ డివిజన్లో దాదాపు 1500 మెజారిటీ సాధించాలన్న లక్ష్యంతో రసూల్ క్షేత్రస్థాయిలో ప్రణాళిక రూపొందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ గాంధీ నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, వీవర్స్ కాలనీ, విఎంఆర్ నగర్, తోట తదితర ప్రాంతాలకు ప్రాంతాల్లో బలంగా ఉండడంతో రసూల్ గెలుపు దాదాపు ఖాయమనే మాట ప్రతి కార్యకర్త నోట వినిపిస్తోంది. డివిజన్ ను టిడిపి అభ్యర్థి రసూల్ చుట్టేస్తున్నారు.. సిపిఎం అభ్యర్థి రఫీ రసూల్.కు మైనార్టీ ప్రాంతాల్లో పోటీ ఇస్తుండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో మూడో స్థానానికి పరిమితం కానుంది