BREAKING
ఎన్నికల అధికారికి టీడీపీ జడ్పీటీసీ బి ఫారం అందజేత గోవింద నామ స్మరణతో మారుమోగిన వాడపల్లి భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు 'హరివరాసనం'.. విడుదల తేదీ అధికారిక ప్రకటన! నెల్లూరు జిల్లాలో జరుగుతున్న లెప్రసీ కేసు డిటెక్షన్ కాంపెయిన్ సర్వే పై సమీక్ష సమావేశం. బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపిన హెచ్‌ఎస్‌బీసీ నిర్ణయం సూర్య హీరోగా జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీన్ మూవీ థియేట్రికల్ అప్‌డేట్! అమెరికా మార్కెట్లలో ఉత్కంఠ వాతావరణం తోటల చెరువుపల్లి ఎంపీటీసీ ఏకగ్రీవం విరువూరులో ఎంపీటీసీ ఏకగ్రీవం ఐపీఓ మార్కెట్లలో హెచ్చరిక గంటలు మోగిస్తున్న 'స్మాష్ అండ్ గ్రాబ్' ధోరణి పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయాలి కోనసీమకు ఈ రాత్రి కాళరాత్రేనా..! ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఓట్ చోరీపై బిజెపి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసీఆర్‌తో ఎమ్మెల్యే జీఎంఆర్ భేటీ అర్నబ్ తుఫాన్ దృష్ట్యా నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

ఈవీఎంలను తెచ్చినప్పుడు మంచివి.. ఓడిపోతే తప్పుబడతారా? కాంగ్రెస్‌పై సీఎం చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు!

Select Suryaa Now
ఈవీఎంలను తెచ్చినప్పుడు మంచివి.. ఓడిపోతే తప్పుబడతారా? కాంగ్రెస్‌పై సీఎం చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు!

సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి:ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుపై కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.

అప్పుడు మంచివి.. ఇప్పుడేమైంది?:
ఈవీఎంల విశ్వసనీయతపై గతంలో తాము కూడా అనుమానాలు వ్యక్తం చేసి సాంకేతిక సంస్కరణలు కోరిన విషయాన్ని గుర్తుచేస్తూనే, ప్రస్తుత కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని చంద్రబాబు తూర్పారబట్టారు. "నేను ఈ దేశంలో ఎన్నో ప్రభుత్వాలను, రాజకీయ పరిణామాలను చూశాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈవీఎంలను ప్రవేశపెట్టినప్పుడు అవే యంత్రాలు చాలా అద్భుతంగా పనిచేశాయి. కానీ ఇప్పుడు ఎన్నికల్లో వరుసగా ఓడిపోతుండటంతో ఆ నెపాన్ని ఈవీఎంలపై నెట్టడం ఎంతవరకు సమంజసం?" అని ఆయన నేరుగా ప్రశ్నించారు. ప్రజాతీర్పును గౌరవించకుండా ఓటమికి యంత్రాలను నిందించే ధోరణి సరైంది కాదన్నారు.

వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీయవద్దు:
ఎన్నికల వ్యవస్థల్లో సాంకేతిక పరిజ్ఞానం పారదర్శకతను పెంచిందని, వీవీప్యాట్ (VVPAT) వంటి వ్యవస్థల ద్వారా ఓటు హక్కు నమోదు మరింత స్పష్టమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితాలు అనుకూలంగా వచ్చినప్పుడు మాట్లాడకుండా, పరాజయం ఎదురైన ప్రతిసారీ ఈవీఎంలను వివాదాల్లోకి లాగడం ప్రజాస్వామ్య వ్యవస్థలకే చేటు తెస్తుందని సీఎం చంద్రబాబు హితవు పలికారు.