29 లో గెలుపు కోసం వైసీపీ అభ్యర్థి మొయిళ్ళ సర్వశక్తులు
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ పరిధిలో ప్రస్తుత కార్పొరేటర్ మోయుళ్ల , ఎన్నికలలో పోటీ చేస్తున్న సురేష్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి గత ఐదు సంవత్సరాలుగా తాము డివిజన్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. మీరు వేసే ప్రతి ఓటు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని, గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. 29వ డివిజన్లో గెలుపు తమదేనన్న నమ్మకంతో వారు ప్రచార జోరుని పెంచారు.. ఆర్థిక వనరులు కూడా వారికి కలిసి రానున్నాయి