BREAKING
ఆత్రేయపురం మండలం జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాస్ పందిరిపల్లిగూడెం ఎంపీటీసీగా పద్మాదేవిని ఏకగ్రీవం అభిషేక్ శర్మ వీరంగం.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం! *రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు శ్రీనిధి విద్యార్థుల ఎంపిక* జనాభా గణన వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెంకన్న సన్నిధిలో ఎలక్షన్ జిల్లా అధికారి ప్రశాంతి ప్రత్యేక పూజలు విరువూరులో వైసీపీ ప్రచార హోరు కాకాణి నాయకత్వంలో విజయమే లక్ష్యంగా ముందుకు.. వాతావరణ మార్పుల నిధులకు నిధుల కొరత లేదు విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు నేరడిగొండ విద్యార్థి జీ విద్య వర్ధన్ ఎంపిక గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో సాంకేతిక అస్థిరత ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన 15వ రోజుకు చేరుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక సమ్మె - ఉద్యోగులను ఆదుకోవాలని మంత్రి సీతక్కకు వినతి నెల్లూరు 59వ డివిజన్‌లో జోరుగా ఎన్నికల ప్రచారం మేరే గ్రూప్ లాభాల జోరు

పెండింగ్ కేసుల పరిష్కారం, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

Select Suryaa Now
పెండింగ్ కేసుల పరిష్కారం, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

రామాయంపేట ; మంగళవారం నిజాంపేట పోలీస్ స్టేషన్‌ను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రాజేష్ మొక్కను అందజేసి ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని, సీసీపీఎన్ఎస్ , ఈ-సాక్ష్య అప్లికేషన్లలో వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.షీ టీమ్స్ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో ‘పోలీస్ అక్క’ కార్యక్రమం నిర్వహించాలని, విపిఓ లు ప్రతి గ్రామాన్ని సందర్శించి డ్రగ్స్ దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కళాబృందాల సహకారంతో విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు.అనంతరం సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, అవినీతికి పాల్పడితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ తనిఖీలో సీఐలు సైదా, సందీప్ రెడ్డి, ఎస్‌ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.