మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి, ఆర్డీవో రమణ
జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్:జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలోని ఎర్రకాలువ సమీపంలో నివసిస్తున్న మత్స్యకారులు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎం.వి. రమణ పేర్కొన్నారు. మత్స్యకారులు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెంటనే తరలివెళ్లాలని కోరారు. అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె. స్లివా జోజి, పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ దాసరి రాంబాబు, గ్రామ రెవెన్యూ అధికారి డి.వి. రాజు పాల్గొన్నారు.
రిపోర్టర్ కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,