7వ బెటాలియన్‌లో యువ ఆపదమిత్ర రెండో బ్యాచ్ శిక్షణ ప్రారంభం
సూర్య డిచ్ పల్లీ : తెలంగాణతెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్ కమాండెంట్ బి.సీతారాం సూచనల మేరకు సెవెంత్ బెటాలియన్‌లో యువ ఆపదమిత్ర రెండో బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణకు మొత్తం 176 మంది విద్యార్థులు హాజరయ్యారు.NSS( జాతీయ సేవా పథకం)89 మంది, BS&G( భారత స్కౌట్స్ అండ్ గైడ్స్)17 మంది,NYKS( నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ )70 మంది పాల్గొన్నారు వారిలో 30 మంది బాలురు కాగా, మిగతా 146మంది బాలికలు ఉన్నారు. విపత్తుల సమయంలో ప్రజలకు తక్షణ సహాయం అందించడం, ప్రాణనష్టాన్ని తగ్గించడం, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి అంశాలపై యువతకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.ఈ సందర్భంగా విపత్తుల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స, బాధితులకు సహాయక చర్యలు అందించే విధానాలపై యువ ఆపదమిత్రలకు శిక్షణ అందించనున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, అగ్నిప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించేలా యువతను తీర్చిదిద్దనున్నారు.యువ ఆపదమిత్ర కార్యక్రమం ద్వారా యువతలో సేవాభావం, సామాజిక బాధ్యత, విపత్తుల సమయంలో ప్రజలకు సహాయం చేసే నైపుణ్యాలు పెంపొందుతాయని అధికారులు పేర్కొన్నారు. శిక్షణ పొందిన యువత విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలిచి, సహాయక చర్యల్లో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ దేవినేని శ్రీనివాసరావు,KT.విజయ్ ఎస్‌డీఆర్ఎఫ్ ఇన్‌చార్జ్ శ్రీనివాస్, తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపర్ణ, మెడికల్ ఆఫీసర్ అనుపమ తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.