2024 ఎన్నికలకు మించి సర్వేపల్లిలో టీడీపీలోకి చేరికలు
తోటపల్లి గూడూరు, మేజర్ న్యూస్ : వైసీపీ నుంచి రోజురోజుకూ పెరుగుతున్న చేరికలతో అత్యంత బలమైన శక్తిగా తెలుగుదేశం పార్టీ. తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురానికి చెందిన 36 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక. అల్లీపురంలో జరిగిన కార్యక్రమంలో వారికి కండువాలు కప్పి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మల్లికార్జునపురం నా దత్తత గ్రామం..ప్రస్తుతం ఆ గ్రామ బాధ్యతలను SEIL కంపెనీ చేపట్టింది. మా ఆధ్వర్యంలో పెద్దఎత్తున జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఆకర్షితులై టీడీపీలో చేరిన 36 దళిత, గిరిజన కుటుంబాలకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నా . గ్రామస్తుల కోసం ఒక్కొక్కటి రూ.30 లక్షలకు పైగా విలువజేసే రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించాను . 280 కుటుంబాలకు కంపెనీ నిత్యజీవితంలో ఉపయోగపడే వస్తువులతో కూడిన వెల్ కం కిట్లు SEIL అందజేసింది. 30 కుటుంబాలకు గొర్రెలు, మరో 30 కుటుంబాలకు మేకలు అందజేశారు..రెండో విడతలో మిగిలిన కుటుంబాలకు కూడా అందజేయనున్నారు. పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు.. ఆర్థికాభివృద్ధి సాధించేదిశగా సహకారం అందిస్తున్నారు. గిరిజనులు, దళితులు ఎక్కువగా ఉండే మల్లికార్జునపురాన్ని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నేను దత్తత తీసుకున్నాను. ప్రభుత్వ నిధులకు అదనంగా ఖర్చు చేసి పేదలకు ప్రత్యేక పర్యవేక్షణతో నాణ్యతతో కూడిన ఇళ్లు కట్టించాం. నియోజకవర్గా వ్యాప్తంగా గిరిజనులు, దళితుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. నిత్యం టీడీపీలో చేరికలు జరుగుతుండటం చాలా సంతోషంగా ఉంది. 2024 ఎన్నికలకు మించి చేరికలు కొనసాగుతున్నాయి...పొదలకూరు మండలంలోనూ మొదటి సారి టీడీపీకి విశేష స్పందన లభిస్తుంది. ప్రజలందరి మద్దతుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాలు సాధించబోతున్నాం. కూటమి ప్రభుత్వంలో చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ లకు వరంగా మారాయి. ఆర్థిక సంఘం నిధులతో పాటు స్థానిక సంస్థలకు వచ్చే ఏ నిధులు డైవర్ట్ కాకూడదని, ప్రతి రూపాయి పల్లెల బాగుకే ఉపయోగపడాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యారంగంలో నారా లోకేష్ విశేష మార్పులు తెస్తున్నారు...ఒక కుటుంబంలో ఎంత మంది బిడ్డలు చదువుకుంటే అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేస్తున్నారు. ఆడపడుచులకు స్త్రీశక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దీపం పథకంతో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయి. అన్నదాత సుఖీభవ పథకంలో కేంద్ర ప్రభుత్వ రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి ఏడాదికి రూ.20 వేలు రైతులకు అందిస్తోంది. సర్వేపల్లి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర నిధులతో పాటు సీఎస్ఆర్ ఫండ్ ను సద్వినియోగం చేసుకుంటున్నాం..
టీడీపీలో చేరిన వారిలో కత్తి శ్రీను, పచ్చా రాజేష్, గంధళ్ల ఇంద్ర, కత్తి శివకృష్ణ, చలంచర్ల వెంకటరమణయ్య, కవరగిరి శ్రీను, తుపాకుల అరవింద్, ఈగా సనత్ కుమార్, పోట్లూరు హేమంత్, బోడెద్దుల శీనయ్య, శీలం మణి, కత్తి పుల్లయ్య, గంధళ్ల మణి తదితరులు