జనసేన పార్టీలో చేరిన 20 కుటుంబాలు
కావలి, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా, కావలి మండలం పెద్ద పట్టపాలెం పంచాయతీలోని పాతనందిమ్మాపురం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు జనసేన పార్టీ లో చేరారు. జనసేన నాయకులు ప్రళయకావేరి భాస్కర్ ఆధ్వర్యంలో మంగళవారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కావలి జనసేన పార్టీ సమన్వయకర్తలు శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు, శ్రీ సమ్మన వెంకటసుబ్బయ్య గారు జనసేన పార్టీ కండువుల కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ కలిసి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.