చీపురుపల్లిలో 31.6 ఎమ్ఎమ్ వర్షపాతం
చీపురుపల్లి సూర్య:
చీపురుపల్లి మండలంలో ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో 31.6 మిల్లీమీటర్ల వర్షపాతం మంగళవారం మధ్యాహ్నం మూడుగంటల వరకు నమోదు అయ్యిందని ఏఎస్ఓ నితిన్ ఆనంద్ తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు 2 ఎమ్ఎమ్, 9.30 నుంచి 10.30 వరకు 1.8 ఎమ్ఎమ్, 10.30 నుంచి 11.30 గంటల వరకు 4.8 ఎమ్ఎమ్, 11.30 నుండి 12.30 గంటల వరకు 5.2 ఎమ్ ఎమ్, 12.30 నుంచి 1.30 వరకు 4.6, 1.30 నుండి 2.30 గంటల మధ్య అత్యధికంగా 13.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు ఆయన తెలిపారు.
మధు, సూర్య చీపురుపల్లి విజయనగరం జిల్లా