BREAKING
ఎన్నికల అధికారికి టీడీపీ జడ్పీటీసీ బి ఫారం అందజేత గోవింద నామ స్మరణతో మారుమోగిన వాడపల్లి భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు 'హరివరాసనం'.. విడుదల తేదీ అధికారిక ప్రకటన! నెల్లూరు జిల్లాలో జరుగుతున్న లెప్రసీ కేసు డిటెక్షన్ కాంపెయిన్ సర్వే పై సమీక్ష సమావేశం. బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపిన హెచ్‌ఎస్‌బీసీ నిర్ణయం సూర్య హీరోగా జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీన్ మూవీ థియేట్రికల్ అప్‌డేట్! అమెరికా మార్కెట్లలో ఉత్కంఠ వాతావరణం తోటల చెరువుపల్లి ఎంపీటీసీ ఏకగ్రీవం విరువూరులో ఎంపీటీసీ ఏకగ్రీవం ఐపీఓ మార్కెట్లలో హెచ్చరిక గంటలు మోగిస్తున్న 'స్మాష్ అండ్ గ్రాబ్' ధోరణి పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయాలి కోనసీమకు ఈ రాత్రి కాళరాత్రేనా..! ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఓట్ చోరీపై బిజెపి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసీఆర్‌తో ఎమ్మెల్యే జీఎంఆర్ భేటీ అర్నబ్ తుఫాన్ దృష్ట్యా నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు: మంత్రి గొట్టిపాటి రవికుమార్:రంగంలోకి 6,000 మంది సిబ్బంది!

Select Suryaa Now
విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు: మంత్రి గొట్టిపాటి రవికుమార్:రంగంలోకి 6,000 మంది సిబ్బంది!

సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి: బంగాళాఖాతంలో దూసుకొస్తున్న 'అర్నబ్' తుఫాను తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ యంత్రాంగాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసింది. తుఫాను ముప్పు, సంసిద్ధత చర్యలపై రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం అమరావతి నుంచి తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (EPDCL) ఉన్నతాధికారులు మరియు జిల్లా ఇంజనీర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈదురు గాలులు, కుండపోత వర్షాల వల్ల విద్యుత్ నెట్‌వర్క్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, సరఫరా నిలిచిపోతే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ – 6,000 మంది సిబ్బంది మోహరింపు:
తుఫాను ప్రభావిత జిల్లాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల నిమిత్తం మొత్తం 6,000 మంది సిబ్బందిని ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి వెల్లడించారు. ఇందులో ఈపీడీసీఎల్ (EPDCL) పరిధి నుంచి 4,000 మంది, ఎస్పీడీసీఎల్ (SPDCL) నుంచి 1,000 మంది, సీపీడీసీఎల్ (CPDCL) నుంచి మరో 1,000 మంది క్షేత్రస్థాయి కార్మికులు విధుల్లో పాల్గొననున్నారు. తీవ్రత అధికంగా ఉండే తీరప్రాంత జిల్లాలకు ప్రత్యేక పర్యవేక్షణ అధికారులను నియమించారు. విద్యుత్ తీగలపై చెట్లు విరిగిపడినా, స్తంభాలు నేలకొరిగినా తక్షణమే తొలగించేందుకు అవసరమైన కట్టర్లు, భారీ క్రేన్లు, అదనపు పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్లను క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

24 గంటలు '1912' కాల్ సెంటర్ సేవలు:
తుఫాను సమయంలో ప్రజలకు నిరంతరం సేవలందించేందుకు '1912' విద్యుత్ టోల్ ఫ్రీ కాల్ సెంటర్‌ను 24 గంటలు అందుబాటులో ఉంచాలని ఈపీడీసీఎల్ సీఎండీని మంత్రి ఆదేశించారు. ఒకే సమయంలో దాదాపు 30 వేల కాల్స్ స్వీకరించే సామర్థ్యంతో ఈ కాల్ సెంటర్‌ను సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. తెగిపడిన కరెంట్ తీగలు, విరిగిన స్తంభాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ప్రమాదం లేదా అంతరాయం తలెత్తితే వెంటనే 1912 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని మంత్రి గొట్టిపాటి విజ్ఞప్తి చేశారు.