పట్టణ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి... గిత్త..!
పట్టణ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి... గిత్త..!
- 14వ వార్డు లో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే
- మున్సిపల్ చైర్మన్.. వార్డు అభ్యర్థులను గెలిపించండి
నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -: నవ నందుల కోట అయినా నందికొట్కూరు పట్టణ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ ,వార్డు అభ్యర్థులకు కి ఒకసారి అవకాశం ఇస్తే పట్టణ అభివృద్ధికి సహకరించిన వారు అవుతారని పట్టణ ప్రజలకు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య విజ్ఞప్తి చేశారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు లో “చెప్పాం.. చేస్తున్నాం” డోర్ టు డోర్, ఎన్నికల ప్రచారంలో భాగంగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ రెండున్నర సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తూ కూటమి బలపరిచిన నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మొల్ల సాబీరున్నిసా మరియు 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్ రేష్మ షేక్ కి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు పై రెండు ఓట్లు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి వార్డు ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు పట్టణ కూటమి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజల తదితరులు పాల్గొన్నారు.