BREAKING
రామాయణం సినిమాకు మద్దతుగా నిలవండి.. యువ వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టుల కష్టాన్ని ప్రశంసించిన సుహైల్ నయ్యర్ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుంటూరు: రేపే జిల్లా స్థాయి రోల్ ప్లే, జానపద నృత్యం పోటీలు :- డీఈఓ సలీం భాషా అర్నాబ్ తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... 2 కూటమి ప్రభుత్వంలో సవాళ్లు సహజం.. ఐక్యతే ముఖ్యం: పవన్ కళ్యాణ్ 37వ డివిజన్లో భారీ మెజారిటీ లక్ష్యంగా రసూల్ అడుగులు 29 లో గెలుపు కోసం వైసీపీ అభ్యర్థి మొయిళ్ళ సర్వశక్తులు నా తండ్రే నాకు ఆదర్శం.. ధర్మేంద్రే పర్ఫెక్ట్ భర్త అంటూ ఈషా డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు కేరళలో ఉద్యోగార్థుల నిరసనలు: షాకింగ్ ఫొటోలు బయటపెట్టిన జీవీఎల్ నెట్నూరులో ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ గెలుపు కోసం....పోరాటం హాలీవుడ్ సంచలన థ్రిల్లర్ ‘అబ్సెషన్’ హిందీ వెర్షన్‌కు వాయిస్ ఓవర్ అందించిన వరుణ్ ధావన్, కృతి సనన్ ప్రిన్స్ అలాయిస్‌తో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ డార్క్ ట్రైలర్ విడుదల.. సరికొత్త థ్రిల్లర్ జోనర్‌లో షనయా కపూర్ మోద-3 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా కే. శాంతమ్మ రిటర్నింగ్ అధికారికి బీ-ఫామ్ సమర్పణ...

విధి నిర్వహణలో ఎస్‌ఐపై కత్తితో దాడి.. నిందితులపై కఠిన చర్యలు

Select Suryaa Now
విధి నిర్వహణలో ఎస్‌ఐపై కత్తితో దాడి.. నిందితులపై కఠిన చర్యలు

ముమ్మిడివరం ‘చెడి తాలింఖానా’లో ఘటన.. నలుగురు నిందితుల గుర్తింపు

ముమ్మిడివరం సూర్య న్యూస్ డేెస్క్: దసరా వేడుకల ముగింపు సందర్భంగా ముమ్మిడివరంలో నిర్వహించిన ‘చెడి తాలింఖానా’ ప్రదర్శనలో విధి నిర్వహణలో ఉన్న ఐ.పోలవరం ఎస్‌ఐ రవీంద్రబాబుపై కత్తితో దాడి జరిగినట్లు అమలాపురం డీఎస్పీ టీ.ఎస్.ఆర్.కే. ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.

ముమ్మిడివరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దసరా వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఓ యువకుడు కిందపడిపోవడంతో అతడిని రక్షించేందుకు ఎస్‌ఐ రవీంద్రబాబు ప్రయత్నించారు.

అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి కత్తితో ఎస్‌ఐపై దాడి చేసినట్లు డీఎస్పీ వివరించారు. దాడి అనంతరం నిందితుడు జనసమూహంలో కలిసిపోయి అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు.

నలుగురు నిందితులపై దర్యాప్తు

ఈ ఘటనలో ప్రాథమికంగా నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు.

పోలీసు అధికారిపై దాడి చేయడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామని, ఘటనకు పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ స్పష్టం చేశారు. నిందితులను త్వరలోనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కార్యక్రమ నిర్వాహకులపైనా చర్యలు

విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై దాడి జరగడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నలుగురు నిర్వాహకులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ప్రస్తుతం ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, దాడికి పాల్పడిన నిందితులను త్వరలోనే గుర్తించి అదుపులోకి తీసుకుంటామని అమలాపురం డీఎస్పీ టీ.ఎస్.ఆర్.కే. ప్రసాద్ తెలిపారు.