ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బీ-ఫారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొని అభ్యర్థులకు బీ-ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మండలంలోని అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయానికి కృషి చేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని, పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.