telangana
మండల స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : తాంసి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేడు నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశం లో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు మరియు ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేర్చాలని సూచించారు. ఈ సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ సతీష్ యాదవ్, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, ఆత్మ చైర్మన్ కౌడాల నారాయణ, ఎంపీడీవో మోహన్ రెడ్డి, తహశీల్దార్ మధుసూదన్ గారితో పాటు వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు , నాయకులు పాల్గొన్నారు.