BREAKING
ప్రతి ఏటా శారీరక, మానసిక హింసకు గురవుతున్న 100 కోట్ల మంది పిల్లలు విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆత్రేయపురం మండలం జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాస్ పందిరిపల్లిగూడెం ఎంపీటీసీగా పద్మాదేవిని ఏకగ్రీవం అభిషేక్ శర్మ వీరంగం.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం! *రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు శ్రీనిధి విద్యార్థుల ఎంపిక* జనాభా గణన వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెంకన్న సన్నిధిలో ఎలక్షన్ జిల్లా అధికారి ప్రశాంతి ప్రత్యేక పూజలు విరువూరులో వైసీపీ ప్రచార హోరు కాకాణి నాయకత్వంలో విజయమే లక్ష్యంగా ముందుకు.. వాతావరణ మార్పుల నిధులకు నిధుల కొరత లేదు విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు నేరడిగొండ విద్యార్థి జీ విద్య వర్ధన్ ఎంపిక గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో సాంకేతిక అస్థిరత ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన 15వ రోజుకు చేరుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక సమ్మె - ఉద్యోగులను ఆదుకోవాలని మంత్రి సీతక్కకు వినతి

బత్తలపల్లి మండలంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం.. మిగతా స్థానాల్లో హోరాహోరీ పోరు!

Select Suryaa Now
బత్తలపల్లి మండలంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం.. మిగతా స్థానాల్లో హోరాహోరీ పోరు!
సంజీవపురం నుండి ఏకగ్రీవమైన తెలుగుదేశం అభ్యర్థి చల్ల శ్రీనివాస్

స్థానిక సంస్థల ఎన్నికల పోరు బత్తలపల్లి మండలంలో వేడెక్కింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బత్తలపల్లి మండలంలో మొత్తం నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైనట్లు తేలింది. డి. చెర్లోపల్లి ఎంపీటీసీ స్థానానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా.. తంబాపురం నుంచి సాకే లక్ష్మీనారాయణ, మాల్యవంతం నుంచి నారాయణరెడ్డి, సంజీవపురం నుంచి చల్లా శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పష్టమైంది.మండలంలోని మిగిలిన స్థానాలకు సంబంధించి ప్రధాన పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. బత్తలపల్లి-1 స్థానానికి టీడీపీ తరఫున పోతక్క, వైఎస్సార్‌సీపీ తరఫున కాటమయ్య బరిలో నిలవగా.. పరుశురాము, వినయ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీపడుతున్నారు. అలాగే ఈదుల ముష్టురు స్థానంలో టీడీపీ అభ్యర్థి సాకే మల్లక్క, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సాకే జయలక్ష్మిల మధ్య ప్రత్యక్ష పోరు నెలకొంది. ఓబులాపురం స్థానానికి టీడీపీ నుండి కప్పల నారప్ప, వైఎస్సార్‌సీపీ నుండి బ్యాల పెద్దయ్య పోటీ చేస్తుండగా.. దంపెట్ల స్థానంలో టీడీపీ అభ్యర్థి బాసికొండ దీపిక, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొగ్గు సృజన తలపడుతున్నారు. బత్తలపల్లి-3 స్థానంలోనూ టీడీపీ అభ్యర్థి లక్ష్మీదేవి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సుమతిల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగుతోంది.

డి చెర్లోపల్లి ఏకగ్రీవమైన బిజెపి  అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి 

మరోవైపు కూటమి పొత్తుల్లో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో కొన్ని స్థానాల్లో రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. కూటమిలోని రెండు వేర్వేరు పార్టీల అభ్యర్థులకు ఒకే స్థానానికి సంబంధించి అధికారిక 'బి-ఫారాలు' అందడంతో ఆయా చోట్ల త్రిముఖ పోరు అనివార్యమైంది. బత్తలపల్లి-2 స్థానంలో టీడీపీ నుండి మౌనిక, వైఎస్సార్‌సీపీ నుండి శంషాద్‌తో పాటు బీజేపీ నుండి చిన్న పెద్దలు బరిలో నిలవగా.. అప్రాచెరువు ఎంపీటీసి స్థానంలో బీజేపీ నుండి వరిమడుగు చెన్నమ్మ, జనసేన నుండి వరిమడుగు ప్రభావతి ఇద్దరికీ బి-ఫారాలు రావడంతో పాటు, వైఎస్సార్‌సీపీ తరఫున శాంతమ్మ పోటీలో నిలిచారు. కూటమిలోని రెండు పార్టీలు ఒకే స్థానానికి బి-ఫారాలతో బరిలో దిగడం, మిగిలిన చోట్ల ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుండటంతో బత్తలపల్లి మండల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.