రాయచోటి ప్రతినిధి మేజర్ న్యూస్: అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లి గ్రామం ఎంపీటీసీ-2 సభ్యుడిగా బాలిపోగు వేణుగోపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు ఆయనకు డిక్లరేషన్ పత్రాలను అందజేశారు.ఎంపీటీసీ-2 అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, యువ నాయకులు మౌర్యా రెడ్డికి బాలిపోగు వేణుగోపాల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ చెన్నముక్కపల్లి-2 ఎంపీటీసీ పరిధిలోని కూటమి నాయకుల సమన్వయంతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తానని, కూటమి బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు సహకరించిన టీడీపీ నాయకులు మడితాటి శ్రీనివాసులు రెడ్డి, రాయుడు కాలనీ 22వ వార్డు కౌన్సిలర్ రంజిత్ రాయల్‌కు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రషీద్ రాయచోటి ప్రతినిధి, అన్నమయ్య జిల్లా.