BREAKING
పట్టణ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి... గిత్త..! పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం : ఎస్ఐ కే. మహేందర్ రెడ్డి రైతుల సమన్వయంతో రీ-సర్వే పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆర్నాల్ తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి, ఆర్డీవో రమణ పెండింగ్ కేసుల పరిష్కారం, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి బత్తలపల్లి మండలంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం.. మిగతా స్థానాల్లో హోరాహోరీ పోరు! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. హృతిక్ రోషన్ రోడీ థీమ్ సాంగ్ విడుదల ఒక్క ప్రాణనష్టం కూడా జరగకూడదు... చిన్నముక్కపల్లె 2 ఎంపీటీసీగా వేణుగోపాల్ ఏకగ్రీవం రేణుక ఎల్లమ్మను దర్శించుకుంటే సర్వశుభాలు 14వ వార్డులో అభివృద్ధి పనుల పరిశీలన విజయ్ దేవరకొండ, రష్మిక జంటపై సైబర్ కంప్లెంట్.. తప్పుడు ప్రచారాలు, ఏఐ వీడియోలపై పోలీసులను ఆశ్రయించిన టీమ్ పియు పరిధిలోని ఎం ఫార్మసీ-ఎల్ ఎల్ ఎం ఫలితాలు విడుదల మండల స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి

నవంబర్ 1 న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవు

Select Suryaa Now
నవంబర్ 1 న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవు

కర్నూలు, అక్టోబర్ 27: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 1, 2026న పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థలు, ఫర్మ్‌లకు స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశాలు జారీ చేశారు…

ఈ మేరకు పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు నవంబర్ 1న స్థానిక సెలవు వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, ఫర్మ్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా స్థానిక సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1981 ప్రకారం పోలింగ్ జరిగే ప్రాంతాల్లోనూ నవంబర్ 1న స్థానిక సెలవు వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థల భవనాలు, ఇతర భవనాలకు పోలింగ్‌కు ముందు రోజు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు రోజున స్థానిక సెలవు వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడంతో పాటు అర్హులైన ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు..