వార్డు ప్రగతి కోసం టిడిపిని గెలిపించండి.. టిడిపి 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాయకు రాజశేఖర్
వార్డు అభివృద్ధి కోసం.. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలకై టిడిపిని గెలిపించాలంటూ మంగళవారం టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి నాయపు రాజశేఖర్ ఓటర్లను అభ్యర్థిం చారు. వార్డులో ఇంటింట ప్రచార కార్యక్రమం నిర్వహించగా.. ఈ ప్రచార పర్వంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి హాజరై.. ఇంటింటా పర్యటిస్తూ నవంబర్ 1న జరగనున్న కార్యక్రమంలో సైకిల్ గుర్తుకు కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్, చైర్మన్ అభ్యర్థి అర్షియా భాను గెలిపించాలని కోరారు.. రాజశేఖర్ ను యువకుడని.. ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయడంతో పాటు వార్డులో ప్రగతి పథంలో అభివృద్ధి చేస్తారని వివరించారు. సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి అభ్యర్థి రాజశేఖర్ మాట్లాడుతూ వార్డు ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచే స్తానని తనకు ఒక్కసారి కౌన్సిలర్ గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.