BREAKING
పోలీస్ సంస్కరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ ర్యాలీ పట్టణ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి... గిత్త..! పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం : ఎస్ఐ కే. మహేందర్ రెడ్డి రైతుల సమన్వయంతో రీ-సర్వే పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆర్నాల్ తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి, ఆర్డీవో రమణ పెండింగ్ కేసుల పరిష్కారం, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి బత్తలపల్లి మండలంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం.. మిగతా స్థానాల్లో హోరాహోరీ పోరు! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. హృతిక్ రోషన్ రోడీ థీమ్ సాంగ్ విడుదల ఒక్క ప్రాణనష్టం కూడా జరగకూడదు... చిన్నముక్కపల్లె 2 ఎంపీటీసీగా వేణుగోపాల్ ఏకగ్రీవం రేణుక ఎల్లమ్మను దర్శించుకుంటే సర్వశుభాలు 14వ వార్డులో అభివృద్ధి పనుల పరిశీలన విజయ్ దేవరకొండ, రష్మిక జంటపై సైబర్ కంప్లెంట్.. తప్పుడు ప్రచారాలు, ఏఐ వీడియోలపై పోలీసులను ఆశ్రయించిన టీమ్ పియు పరిధిలోని ఎం ఫార్మసీ-ఎల్ ఎల్ ఎం ఫలితాలు విడుదల

సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

Select Suryaa Now
సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరి*  *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

 

కర్నూలు, అక్టోబర్ 27: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు  సోషల్ మీడియా లో రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ నుండి ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం  కర్నూలు  కలెక్టరేట్‌లోని సీపీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ సెల్‌ను సంప్రదించాలని  కలెక్టర్ సూచించారు.. 

అభ్యర్థులు, రాజకీయ పార్టీలు వాట్సప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, యూ ట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా ఎంసీఎంసీ నుండి ముందస్తు ధ్రువీకరణ తీసుకోవాలని, ఈ అంశాన్ని ఎంసీఎంసీ ద్వారా గమనించడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. అనుమతి తీసుకోకుండా ప్రచారం చేస్తున్న అభ్యర్థులకు సంబంధిత ఆర్వో ల ద్వారా నోటీసులు పంపించడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.

అలాగే టెలివిజన్ ఛానళ్లు, కేబుల్ నెట్‌వర్క్‌లు, రేడియో, సినిమా హాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే ఆడియో, వీడియో ప్రదర్శనలు, ఈ-పేపర్లు, బల్క్  SMS లు, వాయిస్ మెసేజ్ లకు కూడా   మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ధ్రువీకరణ పొందాలని కలెక్టర్ సూచించారు.