కౌన్సిలర్ గా గెలిపించండి.. 7వ వార్డ్ వైసిపి కౌన్సిలర్ అభ్యర్థి కృపాకర్ రెడ్డి
పాలకుడి గా కాకుం డా మీకు సేవకుడిగా పనిచేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మున్సిపల్ పరిధి లోని 7వ వార్డు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ అభ్యర్థి కృపాకర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంగళ వారం వార్డులోని ఇంటింటికి వెళ్లి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించా లని కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. గతంలో తాను కౌన్సిలర్ గా పని చేశానని.. కౌన్సిలర్ విధులు బాధ్యతలు తో పాటు ప్రజల సంక్షేమానికి, వార్డు అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై తనకు పూర్తిగా అవగాహన ఉంద న్నారు. వార్డు ప్రజల మంచి చేయాలన్న ఆశయంతో మరోసారి మీ ముందుకు వచ్చానని... నవంబర్ 1న జరగనున్న పోలింగ్ కార్యక్రమంలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను కౌన్సిలర్ గా , చైర్మన్ అభ్యర్థి అత్తర్ పర్వీన్ ఫ్యాను గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించా లన్నారు.సంక్షేమానికి పునాది వేసేది వైఎస్సా ర్సీపీ పార్టీ అని అందుకోసమే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మన అభివృద్ధిని మనమే చేసుకుందాం అంటూ ప్రజలకు సూచిస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు ఉన్నారు.