వరి పంటను పరిశీలించిన సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్. అనిల్ కుమార్
మర్కుక్ : మండలంలోనిఎర్రవల్లి గ్రామంలో వరి పంటను సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ ఎస్. అనిల్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, యాసంగి సీజన్‌లో అధిక నీటి అవసరం ఉన్న వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలైన పెసర, మినుము, బొబ్బెర, శెనగతో పాటు కూరగాయ పంటలను సాగు చేయాలని రైతులను కోరారు.నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల వైవిధ్యీకరణను పాటించడం ద్వారా నీటి వనరులను ఆదా చేసుకోవడంతో పాటు రైతులకు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుందని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాము, వ్యవసాయ విస్తరణ అధికారి విష్ణు మరియు ఎర్రవల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.