మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండపేట పురపాలక సంఘ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ మంగళవారం పరిశీలించారు. మండపేటలోని ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన ఎన్నికల విధుల నిర్వహణ, సిబ్బంది కేటాయింపు, ఎన్నికల సామగ్రి పంపిణీ, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంతోపాటు, భద్రతా చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య, మండపేట పట్టణ, గ్రామీణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.