BREAKING
విద్యార్థినులకు న్యాయ* చట్టాలపై అవగాహన సదస్సు ప్రాణ నష్టం జరుగకుండా చూడండి మీ సేవకుడిగా పని చేస్తా కౌన్సిలర్ గా గెలిపించండి.. 7వ వైసిపి కౌన్సిలర్ అభ్యర్థి కృపాకర్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత.. రూ.700 కోట్ల క్లబ్‌లో రజినీకాంత్ జైలర్ 2 పోలీస్ ఆఫీసర్‌గా సాయి పల్లవి రచ్చ.. ఆకట్టుకుంటున్న లేటెస్ట్ మూవీ టీజర్ నవంబర్ 1న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటింపు* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* వార్డు ప్రగతి కోసం టిడిపిని గెలిపించండి.. టిడిపి 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాయకు రాజశేఖర్ 'ఆదర్శ కుటుంబం' సినిమాకు బిగ్ షాక్ లేకుండా ఊరట.. టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ధనాపురం, హోన్నంపల్లి ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా రాజగోపాల్‌కు బీ-ఫారం అందజేత ‘బేబీ జాన్’ ఫలితంపై నటి కీర్తి సురేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ హోస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి.. స్పెషల్ గెస్టులుగా బ్రహ్మానందం, సునీల్, సత్య ఎన్నికలు ఎందుకు పెట్టారు? క్రిస్మస్ బరిలో ‘కింగ్’ వర్సెస్ ‘కింగ్’ బాక్సాఫీస్ ఫైట్.. షారుఖ్, నాగార్జున సినిమాల రిలీజ్ డేట్ ఫిక్స్ ఫీడ్‌బ్యాక్ తీసుకునేంత శక్తి కూడా ఉండదు.. ఏఆర్ రెహ్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్నాం... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.

Select Suryaa Now
అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్నాం...   కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.
 సూర్య కరీంనగర్ ప్రతినిధి ::కరీంనగర్ ను అభివృద్ధి చేయడం వైపే అడుగులు వేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా బుధవారం నగరంలోని 4వ డివిజన్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటించి... పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దుర్షెడ్ - గోపాల్ పూర్ రోడ్డులో రూ. 78 లక్షల యుఐడిఎఫ్ నిధులతో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పోరేటర్ భూపతి రవీంధర్, పలువురు కార్పోరేటర్లతో కలిసి సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం పనులకు కేంద్ర మంత్రి భూమీ పూజ చేసి పనులను ప్రారంభం చేశారు. అనంతరం దుర్షెడ్- గోపాల్ పూర్ రోడ్డులో ఉన్న స్వయంభు విఘ్నేశ్వర స్వామీ ఆలయాన్ని మంత్రి బండి సంజయ్ కుమార్ సందర్శించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, పలువురు కార్పోరేటర్లతో కలిసి స్వామీ వారిని దర్శించుకొని... ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు మేయర్, డిప్యూటీ మేయర్లను స్థానిక కార్పోరేటర్ ప్రజలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. నగరాభివృద్ధికి కృషి చేస్తూ... ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. యూఐడిఎఫ్ నిధులతో పాటు ఇతర గ్రాంట్ల నిధులతో పాలకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేసి... ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. త్వరలో యూసిఎఫ్ నిధులతో నగరంలో అభివృద్ధి పనులు ప్రారంభం చేసి... ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.