BREAKING
విజయ్ దేవరకొండ, రష్మిక జంటపై సైబర్ కంప్లెంట్.. తప్పుడు ప్రచారాలు, ఏఐ వీడియోలపై పోలీసులను ఆశ్రయించిన టీమ్ పియు పరిధిలోని ఎం ఫార్మసీ-ఎల్ ఎల్ ఎం ఫలితాలు విడుదల మండల స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి విద్యార్థులు ఆంగ్ల భాషాపై పట్టు సాదించాలి - కలెక్టర్ రాజర్షి షా ప్రజా సమస్యలపై చైర్‌పర్సన్ సుమలత శ్రీకాంత్ ప్రత్యేక దృష్టి విద్యార్థుల వికాసానికి ఆచరణాత్మక బోధన ముఖ్యం - కలెక్టర్ భవేశ్ మిశ్రా. ఆ కాలంలోనే నసీరుద్దీన్ షా చూపిన నిజాయితీ.. హీరోయిన్ వయసుపై ఆయన వ్యక్తం చేసిన సందేహాలు విధి నిర్వహణలో ఎస్‌ఐపై కత్తితో దాడి.. నిందితులపై కఠిన చర్యలు మహానటి విజయం తర్వాత ఆర్థిక ఇబ్బందులు.. కీర్తి సురేశ్ సంచలన వ్యాఖ్యలు రామన్నపేటలో రైతును అభినందించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ చీపురుపల్లిలో 31.6 ఎమ్ఎమ్ వర్షపాతం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన రంజిత్ రాయల్ కేజీఎఫ్ సక్సెస్ తర్వాత రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ వార్తలపై స్పందించిన శ్రీనిధి శెట్టి.. ఏమన్నారంటే? బాక్సాఫీస్ బరిలో షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సంచలనం.. కొత్త పోస్టర్‌తో అంచనాలు పెంచేసిన బాద్‌షా నవ్వులు పంచే పోలీస్‌గా సూర్య.. ‘సీన్’ మూవీ నుంచి అదిరిపోయే గ్లింప్స్ వీడియో వైరల్

పోలీస్ ఉద్యోగాల సాధనకు క్రమశిక్షణ, పట్టుదలే కీలకం.. అభ్యర్థులకు ఎస్పీ స్నేహ మెహ్రా దిశానిర్దేశం

Select Suryaa Now
పోలీస్ ఉద్యోగాల సాధనకు క్రమశిక్షణ, పట్టుదలే కీలకం.. అభ్యర్థులకు ఎస్పీ స్నేహ మెహ్రా దిశానిర్దేశం

కొడంగల్, మేజర్ న్యూస్: పోలీస్ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో సన్నద్ధమవుతున్న అభ్యర్థులు క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలనతో ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సాధించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ సూచించారు. కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కడా (KADA) ఆధ్వర్యంలో కానిస్టేబుల్, సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఉద్యోగాల కోసం ఉచితంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులను మంగళవారం ఆమె సందర్శించి, వారి లక్ష్యాలు, పరీక్షల సన్నద్ధత గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు పలు సూచనలు చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు ప్రతి అంశంపై పట్టు సాధించాలని, సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని సూచించారు. రాత పరీక్షలతో పాటు శారీరక దారుఢ్యానికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ శారీరక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. అపజయాలకు నిరాశ చెందకుండా, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆత్మవిశ్వాసంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోలీస్ ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని, ప్రజలకు సేవ చేయడంతో పాటు సమాజంలో శాంతిభద్రతలను కాపాడే గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు. కడా ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాలకు ఎంపికై తమ కుటుంబాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కడా అధికారి వెంకట్ రెడ్డి, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, శిక్షణ పొందుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు.