BREAKING
గుంటూరు: రేపే జిల్లా స్థాయి రోల్ ప్లే, జానపద నృత్యం పోటీలు :- డీఈఓ సలీం భాషా అర్నాబ్ తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... 2 కూటమి ప్రభుత్వంలో సవాళ్లు సహజం.. ఐక్యతే ముఖ్యం: పవన్ కళ్యాణ్ 37వ డివిజన్లో భారీ మెజారిటీ లక్ష్యంగా రసూల్ అడుగులు 29 లో గెలుపు కోసం వైసీపీ అభ్యర్థి మొయిళ్ళ సర్వశక్తులు నా తండ్రే నాకు ఆదర్శం.. ధర్మేంద్రే పర్ఫెక్ట్ భర్త అంటూ ఈషా డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు కేరళలో ఉద్యోగార్థుల నిరసనలు: షాకింగ్ ఫొటోలు బయటపెట్టిన జీవీఎల్ నెట్నూరులో ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ గెలుపు కోసం....పోరాటం హాలీవుడ్ సంచలన థ్రిల్లర్ ‘అబ్సెషన్’ హిందీ వెర్షన్‌కు వాయిస్ ఓవర్ అందించిన వరుణ్ ధావన్, కృతి సనన్ ప్రిన్స్ అలాయిస్‌తో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ డార్క్ ట్రైలర్ విడుదల.. సరికొత్త థ్రిల్లర్ జోనర్‌లో షనయా కపూర్ మోద-3 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా కే. శాంతమ్మ రిటర్నింగ్ అధికారికి బీ-ఫామ్ సమర్పణ... ఈవీఎంలను తెచ్చినప్పుడు మంచివి.. ఓడిపోతే తప్పుబడతారా? కాంగ్రెస్‌పై సీఎం చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు! జాతీయ స్థాయి క్యానోయింగ్, కయాకింగ్ పోటీల్లో నగరం కళాశాల విద్యార్థికి రెండు కాంస్య పతకాలు

విద్యార్థులు ఆంగ్ల భాషాపై పట్టు సాదించాలి - కలెక్టర్ రాజర్షి షా

Select Suryaa Now
విద్యార్థులు ఆంగ్ల భాషాపై పట్టు సాదించాలి - కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై పట్టు పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన స్పోకెన్ ఇంగ్లీష్ రివ్యూ మీటింగ్ కమ్ కాంపిటీషన్స్ ను మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు.నేటి పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషా సంభాషణ నైపుణ్యాలు ఎంతో అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే ఇంగ్లీష్‌లో ధైర్యంగా, స్పష్టంగా మాట్లాడేలా ప్రోత్సహించాలని అన్నారు. పాఠశాలల్లో స్పోకెన్ ఇంగ్లీష్ బోధనను సమర్థవంతంగా అమలు చేస్తూ, విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై ఉన్న భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల ఆంగ్ల భాషా సామర్థ్యాలు, ఇప్పటివరకు సాధించిన పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం వివిధ అంశాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కలెక్టర్ అభినందించి, మరింతగా రాణించాలని ప్రోత్సహించారు. విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు.కార్యక్రమంలో ఆరోగ్య పాఠశాల జిల్లా కోఆర్డినేటర్ అజయ్, స్కూల్ అసిస్టెంట్లు రఘునాథ్, బాలాజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.