BREAKING
గుంటూరు: రేపే జిల్లా స్థాయి రోల్ ప్లే, జానపద నృత్యం పోటీలు :- డీఈఓ సలీం భాషా అర్నాబ్ తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... 2 కూటమి ప్రభుత్వంలో సవాళ్లు సహజం.. ఐక్యతే ముఖ్యం: పవన్ కళ్యాణ్ 37వ డివిజన్లో భారీ మెజారిటీ లక్ష్యంగా రసూల్ అడుగులు 29 లో గెలుపు కోసం వైసీపీ అభ్యర్థి మొయిళ్ళ సర్వశక్తులు నా తండ్రే నాకు ఆదర్శం.. ధర్మేంద్రే పర్ఫెక్ట్ భర్త అంటూ ఈషా డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు కేరళలో ఉద్యోగార్థుల నిరసనలు: షాకింగ్ ఫొటోలు బయటపెట్టిన జీవీఎల్ నెట్నూరులో ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ గెలుపు కోసం....పోరాటం హాలీవుడ్ సంచలన థ్రిల్లర్ ‘అబ్సెషన్’ హిందీ వెర్షన్‌కు వాయిస్ ఓవర్ అందించిన వరుణ్ ధావన్, కృతి సనన్ ప్రిన్స్ అలాయిస్‌తో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ డార్క్ ట్రైలర్ విడుదల.. సరికొత్త థ్రిల్లర్ జోనర్‌లో షనయా కపూర్ మోద-3 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా కే. శాంతమ్మ రిటర్నింగ్ అధికారికి బీ-ఫామ్ సమర్పణ... ఈవీఎంలను తెచ్చినప్పుడు మంచివి.. ఓడిపోతే తప్పుబడతారా? కాంగ్రెస్‌పై సీఎం చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు! జాతీయ స్థాయి క్యానోయింగ్, కయాకింగ్ పోటీల్లో నగరం కళాశాల విద్యార్థికి రెండు కాంస్య పతకాలు

విద్యార్థుల హక్కులపై అవగాహన కల్పించాలి -ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శృతి

Select Suryaa Now
విద్యార్థుల హక్కులపై అవగాహన కల్పించాలి -ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శృతి

 సురక్షిత్ బచ్‌పన్ అభియాన్  భారతదేశంలో పిల్లల రక్షణ, హక్కులు , భద్రతను పెంపొందించడం కోసం ఉద్దేశించిన ముఖ్యమైన  కార్యక్రమమని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శృతి దూత అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో  నాగర్ కర్నూల్ పట్టణంలోని గవర్నమెంట్ ఉన్నత పాఠశాల  నందు సురక్షిత్ బచ్పన్ అభియాన్ -ఏ పాన్ ఇండియా స్కూల్ అవేర్నెస్ క్యాంపెయిన్ గురించి విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  హాజరైన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ 6 సంవత్సరాల వయస్సు నుంచి 14 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న బాల బాలికలు  అందరూ తప్పనిసరిగా పాఠశాలకు వెళ్ళి చదువు కోవాలనీ అన్నారు. చిన్న పిల్లలపై జరిగే లైంగిక దాడులు, వేధింపులను అడ్డుకోవడం కోసం ఏర్పాటైన పోక్సో చట్టం పై పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం  కార్యక్రమం ముఖ్య ఉదేశ్యం అన్నారు. ప్రతి బిడ్డకు స్వేచ్ఛగా చదువుకునే, ఆడుకునే సురక్షితమైన వాతావరణాన్ని అందించడం, పాఠశాలల్లో విద్యార్థులకు గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ గురించి వివరించడం చేస్తున్నట్లు తెలిపారు.

పి. వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్