telangana
రాసి సీడ్స్ 659 పత్తి విత్తనాలపై అవగాహన సదస్సు
సూర్య జైనూర్: జైనూర్ మండలంలోని మార్కగూడ గ్రామంలో రైతు సలీంబాయి పత్తి చేనులో రాసి సీడ్స్ 659 పత్తి విత్తనాల రకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాసి సీడ్స్ ఆర్‌సీఎం కె. ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, ఈ రకం పత్తి విత్తనాలు అధిక కాయలతో మెరుగైన దిగుబడిని అందిస్తాయని తెలిపారు. రసం పీల్చే పురుగులు, దోమపోటు, తామర పురుగులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయని, పత్తి ఏరడం కూడా సులభంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ కిషోర్ బివాజి, ఈఏఎస్‌వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.