BREAKING
ఎన్నికల అధికారికి టీడీపీ జడ్పీటీసీ బి ఫారం అందజేత గోవింద నామ స్మరణతో మారుమోగిన వాడపల్లి భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు 'హరివరాసనం'.. విడుదల తేదీ అధికారిక ప్రకటన! నెల్లూరు జిల్లాలో జరుగుతున్న లెప్రసీ కేసు డిటెక్షన్ కాంపెయిన్ సర్వే పై సమీక్ష సమావేశం. బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపిన హెచ్‌ఎస్‌బీసీ నిర్ణయం సూర్య హీరోగా జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీన్ మూవీ థియేట్రికల్ అప్‌డేట్! అమెరికా మార్కెట్లలో ఉత్కంఠ వాతావరణం తోటల చెరువుపల్లి ఎంపీటీసీ ఏకగ్రీవం విరువూరులో ఎంపీటీసీ ఏకగ్రీవం ఐపీఓ మార్కెట్లలో హెచ్చరిక గంటలు మోగిస్తున్న 'స్మాష్ అండ్ గ్రాబ్' ధోరణి పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయాలి కోనసీమకు ఈ రాత్రి కాళరాత్రేనా..! ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఓట్ చోరీపై బిజెపి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసీఆర్‌తో ఎమ్మెల్యే జీఎంఆర్ భేటీ అర్నబ్ తుఫాన్ దృష్ట్యా నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

పలువురిని పరామర్శించిన డాక్టర్ రాజశ్రీ :ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం

Select Suryaa Now
పలువురిని పరామర్శించిన డాక్టర్ రాజశ్రీ :ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం

సీతానగరం, మేజర్ న్యూస్, :రాజమహేంద్రవరం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సీతానగరం, కోరుకొండ మండలాలకు చెందిన పలువురిని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సతీమణి డాక్టర్ రాజశ్రీ మంగళవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

రాజమహేంద్రవరం చక్ర ఆస్పత్రిలో ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స పొందుతున్న సీతానగరం మండలం మొగ్గల గ్రామానికి చెందిన ప్రగడ లక్ష్మిని డాక్టర్ రాజశ్రీ పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా, కిమ్స్ ఆస్పత్రిలో గుండె సంబంధిత సమస్యతో చికిత్స పొందుతున్న సింగవరం మాజీ ఎంపీటీసీ సభ్యుడు కొమిరిశెట్టి వెంకటేశ్వరరావును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

రాజమహేంద్రవరం సాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోరుకొండ మండలం కాపవరం గ్రామానికి చెందిన అంబటి కృష్ణను కూడా డాక్టర్ రాజశ్రీ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు, వైద్యులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల వివరాలను తెలుసుకున్నారు.