రాయచోటి ప్రతినిధి మేజర్ న్యూస్: రాయచోటి పట్టణం రాయుడుడు కాలని 22 వ వార్డు కౌన్సిలర్ రంజిత్ రాయల్ ఎపి రవాణా,యువజన,క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నీ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.తమపై నమ్మకం ఉంచి రాయుడు కాలని కౌన్సలర్ గా అవకాశం కల్పించిన ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అదే విధంగా రాయుడు కాలని పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధికి మీ యొక సహకారం తో ముందుకు వెళ్ళడంతో పాటు భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు.మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో పాటు నియోజకవర్గం నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి,యువనాయకులు మౌర్యా రెడ్డి,టీడీపీ నాయకులు మడితాటి శ్రీనివాసులు రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు.