బీసీ బిడ్డల ఎదుగుదలను అడ్డుకోవద్దు
సంస్థాన్ నారాయణపురం. మేజర్ న్యూస్ : బీసీ యువత రాజకీయంగా ఎదగడాన్ని అడ్డుకోవద్దని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ల కార్తీక్ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో ఈఎల్వీ భాస్కర్‌కు మద్దతుగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారని తెలిపారు. బీసీలు రాజకీయాల్లోకి రావొద్దా? నాయకులుగా ఎదగకూడదా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ప్రతి సామాజిక వర్గానికీ సమాన అవకాశాలు ఉండాలని పేర్కొన్నారు.
సేవా కార్యక్రమాలపై అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో ప్రశ్నించవచ్చని, వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. బీసీ యువత విద్య, ఉద్యోగాలు, వ్యాపారంతో పాటు రాజకీయ రంగంలోనూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీసీలు ఓట్లు వేయడానికే కాకుండా పాలనలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈఎల్వీ భాస్కర్‌కు బీసీ యువజన సంఘం తరఫున సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొప్పు రామకృష్ణ, సూర్వి శ్రీకాంత్ గౌడ్, కొత్త రాజు, యశ్వంత్, మణి, సాయిచరణ్, పండు తదితరులు పాల్గొన్నారు.