telangana
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కస్టమర్ల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
సూర్య జైనూర్ : సిర్పూర్ (యు)తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిర్పూర్ (యు) శాఖలో రైతు, బ్యాంక్ కస్టమర్ల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా కొమురం భీంరావు, ఉపాధ్యక్షుడిగా ఆత్రం బీర్షాను బ్యాంక్ మేనేజర్ గజేంద్ర సోలంకే, ఫీల్డ్ అసిస్టెంట్ వంశీ, క్యాషియర్ సందీప్ తేజతో పాటు బ్యాంక్ సిబ్బంది సమక్షంలో ఎన్నుకున్నారు. బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కమిటీ సభ్యులు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు కొమురం భీంరావు, ఉపాధ్యక్షుడు ఆత్రం బీర్షా, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తొడసం ధర్మారావు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.