జనసేన అభ్యర్థికి బీఫారం అందజేసిన సామినేని
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన విజయమే లక్ష్యం.. సామినేని ఉదయభాను..
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-విజయవాడ లోని విద్యాధరపురంలోని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాల పరిధిలో జనసేన పార్టీ తరఫున జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను బీ-ఫారాలను అందజేశారు.
ఈ సందర్భంగా అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, జనసైనికులు మరియు కూటమి సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల్లోకి వెళ్లి పార్టీ ఆశయాలను, ప్రజా సంక్షేమ లక్ష్యాలను బలంగా తీసుకెళ్లి, ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి అక్కల రామమోహనరావు (గాంధీ) , జనసేన నాయకులు బోలియాశెట్టి శ్రీకాంత్ , పూజారి రాజేష్ , బడిశ మురళీకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.
రిపోర్టర్ :-శివా జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా