నాలుగు వార్డుల్లో రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి ముమ్మర పర్యటన
పలమనేరు సూర్య మేజర్ న్యూస్ :పలమనేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి విస్తృతంగా పర్యటించారు. 15, 16, 17, 18వ వార్డుల్లో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ, మున్సిపాలిటీ అభివృద్ధికి తనకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్