పలమనేరు ఎన్నికల బరిలో రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి జోరు
పలమనేరు, మేజర్ న్యూస్ :పలమనేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి, 16వ వార్డు టీడీపీ అభ్యర్థి అన్నపూర్ణ మూర్తి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డుల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. తమకు మద్దతు తెలిపి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్: అనిల్ కుమార్ యాదవ్