BREAKING
మెగాస్టార్ చిరంజీవి మెగావర్స్ షోకి రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే ఉత్తరాంధ్ర ప్రజల కొంగుబంగారం – విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం! రెండు రోజులు పాఠశాలలు సెలవులు మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ షేర్ మహమ్మద్ పేట టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య వారణాసి' కథపై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకధీరుడు రాజమౌళి సీతానగరం మండలం జడ్పీటీసీ అభ్యర్థి కంకణపల్లి అనురాధ కు బి ఫారం అందచేసిన ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర… పదిహేను రోజుల వ్యవధిలో రెండు భారీ చిత్రాలతో సాయిపల్లవి సందడి అవినీతిని తొలగించి అభివృద్ధికి పట్టం కడదాం హకీంపేటలో రైతు మేళాకు సన్నాహాలు.. స్థలాలను పరిశీలించిన కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా ఓటీటీలోకి సుందీప్ కిషన్ సినిమా.. ప్రముఖ డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ ఎప్పుడంటే? జగ్గయ్యపేట పట్టణంలో కూటమి ప్రచార హోరు నాలుగు వార్డుల్లో రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి ముమ్మర పర్యటన అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్నాం... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. జనసేన అభ్యర్థికి బీఫారం అందజేసిన సామినేని

కాగజ్ నగర్ ఎక్సైజ్ కార్యాలయం ముందు బార్ యజమానులు , సిబ్బంది ధర్నా

Select Suryaa Now
కాగజ్ నగర్ ఎక్సైజ్ కార్యాలయం ముందు బార్ యజమానులు , సిబ్బంది ధర్నా

సూర్య,  కాగజ్‌నగర్:పట్టణంలో బెల్టు షాపుల జోరు పెరుగుతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మద్యం విక్రయాల నియంత్రణపై అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడంతో కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు పెరిగే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మద్యం విక్రయాలను నియంత్రించాలని, తమ కుటుంబాలను కాపాడాలని మహిళలు పలుమార్లు ధర్నాలు, నిరసనలు చేసిన విషయాన్ని ప్రజలు గుర్తుచేస్తున్నారు. అయినప్పటికీ బెల్టు షాపులపై సమర్థవంతమైన చర్యలు కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు.మరోవైపు, ప్రభుత్వానికి లక్షల రూపాయల లైసెన్సు ఫీజులు చెల్లించి నిబంధనల ప్రకారం బార్లు నిర్వహిస్తున్న యజమానులు గిరాకీ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. బెల్టు షాపుల్లో ఆహార పదార్థాల విక్రయాలు, కూర్చుని  దేశి, గుడుంబా, కల్తీ   మద్యం సేవించే ఏర్పాట్లు ఉన్నాయంటూ బార్ యజమానులు ఆరోపిస్తున్నారు. వైన్స్‌లో పర్మిట్ రూముల పేరుతో సిట్టింగ్ సౌకర్యాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, తమ విషయంలో మాత్రం ఆంక్షలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మంగళవారం కాగజ్‌నగర్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట పట్టణంలోని మూడు బార్ల యజమానులు, కార్మికులు ధర్నా నిర్వహించారు. బార్ల సమస్యలను పరిష్కరించి, మద్యం విక్రయాల విషయంలో అందరికీ ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించినా స్పందన లేదని, హైకోర్టును కూడా ఆశ్రయించినట్లు వారు తెలిపారు.