సీతానగరం మండలం జడ్పీటీసీ అభ్యర్థి కంకణపల్లి అనురాధ కు బి ఫారం అందచేసిన ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర…
సీతానగరం అక్టోబర్ 27 మేజర్ న్యూస్...…సీతానగరం మండలం జడ్పీటీసీ స్థానానికి టిడిపి పార్టీ తరుపున బరిలో పెదభోగిలి పంచాయతీకి చెందిన టిడిపి సీనియర్ పార్టీ నాయకులు కంకణపల్లి అరవింద్ కుమార్ తల్లి కంకణపల్లి అనురాధకు జడ్పిటిసి అభ్యర్థిగా బి ఫారం మంగళవారం ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర తమ క్యాంప్ కార్యాలయంలో మండల నాయకుల సమక్షంలో పార్టీ బి ఫారం అందచేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు అందరూ సమీష్టిగా క్షేత్ర స్థాయిలో 17 సెగ్మెంట్లలో గల ఓటర్ల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకి వివరించి మండలం ప్రజలందరి మద్దతు తీసుకుని మంచి విజయాన్ని సాధించి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు. మండల పార్టీ నాయకులు రౌతు వేణుగోపాల్ నాయుడు. బుడిటి శీను. పెంట సత్యం నాయుడు. టెంటు వెంకటప్ప నాయుడు . కంకణపల్లి అరవింద్ కుమార్. సబ్బనా శ్రీనివాసరావు. చింతాడ సత్యం. సాల హరిబాబు తో పాటు పలువురు పాల్గొనడం జరిగింది.