అవినీతిని తొలగించి అభివృద్ధికి పట్టం కడదాం
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-సంక్షేమం, అభివృద్ధి అంటే ప్రజలకు గుర్తుకొచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని తన్నీరు సుధారాణి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ హఫిజున్నీసా పేర్కొన్నారు. అవినీతిని తొలగించి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధికి పట్టం కట్టాలని వారు పిలుపునిచ్చారు.
జగ్గయ్యపేట పట్టణంలోని 23వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు సతీమణి తన్నీరు సుధారాణి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీమతి షేక్ హఫిజున్నీసా, 23వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కావేటి లక్ష్మి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు వార్డులోని ప్రజలను కలిసి పార్టీ విధానాలను, ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడం వంటి అంశాలపై దృష్టి సారిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. ప్రజల ఆదరాభిమానాలు, ఆశీస్సులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తెలియజేశారు
రిపోర్టర్ :-శివా జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా