BREAKING
మెగాస్టార్ చిరంజీవి మెగావర్స్ షోకి రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే ఉత్తరాంధ్ర ప్రజల కొంగుబంగారం – విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం! రెండు రోజులు పాఠశాలలు సెలవులు మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ షేర్ మహమ్మద్ పేట టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య వారణాసి' కథపై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకధీరుడు రాజమౌళి సీతానగరం మండలం జడ్పీటీసీ అభ్యర్థి కంకణపల్లి అనురాధ కు బి ఫారం అందచేసిన ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర… పదిహేను రోజుల వ్యవధిలో రెండు భారీ చిత్రాలతో సాయిపల్లవి సందడి అవినీతిని తొలగించి అభివృద్ధికి పట్టం కడదాం హకీంపేటలో రైతు మేళాకు సన్నాహాలు.. స్థలాలను పరిశీలించిన కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా ఓటీటీలోకి సుందీప్ కిషన్ సినిమా.. ప్రముఖ డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ ఎప్పుడంటే? జగ్గయ్యపేట పట్టణంలో కూటమి ప్రచార హోరు నాలుగు వార్డుల్లో రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి ముమ్మర పర్యటన అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్నాం... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. జనసేన అభ్యర్థికి బీఫారం అందజేసిన సామినేని

20వ డివిజన్‌ కార్పొరేటర్ అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ ను అభివృద్ధి చేస్తా. ఎస్.కె షాహినా

Select Suryaa Now
20వ డివిజన్‌ కార్పొరేటర్ అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ ను అభివృద్ధి చేస్తా. ఎస్.కె షాహినా

తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్ 

ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్‌ను అభివృద్ధి చేస్తా

20వ డివిజన్ జనసేన అభ్యర్థి షాహిన హామీ

డివిజన్‌లో విస్తృతంగా ఇంటింటి ప్రచారం


20వ డివిజన్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జనసేన పార్టీ కూటమి అభ్యర్థి షాహిన తెలిపారు. తన గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె ప్రజలను కోరారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె డి.ఆర్. మహల్ ఏరియా, గ్రీన్ పార్క్ అపార్ట్‌మెంట్, ఓబులం హాస్పిటల్ పరిసరాలు, పాత తిరుచానూరు రోడ్డు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటూ, తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.అలాగే మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్‌కు సైకిల్ గుర్తుపై, కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఆదరించాలని షాహిన కోరారు. డివిజన్‌లోని కూటమి నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె వారి మద్దతు, ఆశీర్వాదాలు పొందారు.
షాహిన చేపట్టిన ఇంటింటి ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలను కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎస్కే బాబు, జనసేన నాయకురాలు కీర్తన, గంగమ్మ ఆలయ బోర్డు సభ్యుడు రుద్ర కిషోర్, హిమవంతు, వజీర్, బుడంగుట్ల కుమార్, నల్లాని బాలాజీ, నీలిమ, బీజేపీ మంజు, పోలీస్ బాబు, శ్రీను, డి.ఆర్. మహల్ కోటి, సుబ్రమణ్యం, రవితేజ, మునికృష్ణ, కార్తీక్, జనార్ధన్, మునీంద్రతో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి